అంగన్వాడి కార్యకర్తలకు పోషణ భీ పడాయి భీ రెండవ రోజు శిక్షణ కార్యక్రమం
అంగన్వాడి కార్యకర్తలకు పోషణ భీ పడాయి భీ రెండవ రోజు శిక్షణ కార్యక్రమం
నెల్లూరు రూరల్ (మేజర్ న్యూస్ )
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో ఐ సి డి ఎస్ నెల్లూరు ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడి కార్యకర్తలకు పోషణ భీ పడాయి భీ రెండవ రోజు శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక బాలుర మరియు బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భవతి గా నమోదు అయిన రోజు నుండి బిడ్డకు 24 నెలలు పూర్తి అయ్యే వరకు గల 1000 రోజుల సంరక్షణ గురించి మరియు అంగన్వాడి కేంద్రాలలో 0 నుడి 5 సంవత్సరాల లోప పోషణ పిల్లలను గుర్తించి వారిలో పోషణ మీద దృష్టి పెట్టాలని, బిడ్డకు మొదటి 6 నెలల వరకు తల్లి పాల యొక్క ప్రాముఖ్యత గురించి అలాగే 7 వ నెల నుండి తల్లి పాలతో పాటు బిడ్డకు ఇవ్వవలసిన అనుబంధ పోషకాహారం గురించి వివరించటం జరిగింది. అలాగే అంగన్వాడి కేంద్ర పరిధి లోని దివ్యంగ పిల్లలను గుర్తించి వారికి ప్రభుత్వం అందించే సేవల గురించి తెలియ చేయడం జరిగింది అ ఈ శిక్షణ కార్యక్రమం లో సీడీపీఓ కే . లక్ష్మీ దేవి మరియు ప్రాజెక్టు సూపర్వైజర్ లు అయిన స్వరూప, సుకన్య, నాగలక్ష్మి దేవమ్మ, లక్ష్మీ రాజ్యం, కవిత పాల్గొన్నారు.