కావలి ఎడవల్లి లో అధ్వానంగా పారిశుద్ధ్యం
కావలి ఎడవల్లి లో అధ్వానంగా పారిశుద్ధ్యం
జ్వరాల బారిన పడిన ప్రజలు
ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ ఏఎస్పేట మండలంలోని కావలి ఎడవల్లి గ్రామంలో అధ్వానంగా పారిశుధ్యం ఉండడంతో గ్రామంలో ప్రజలు జ్వరాల బారిన పడి అల్లాడుతున్నారు దాంతో వెంటనే స్పందించిన చిరమణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ జ్యోతి రాణి కావలిఎడవల్లి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు గ్రామంలో ఇళ్లలోని మురికి నీరు రోడ్లపైకి వచ్చి చేరడం రక్షిత మంచినీటి ట్యాంకులను క్లోరినేషన్ చేయకపోవడం గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంతో బీసీ కాలనీ గ్రామంలో ని ప్రజలుజ్వరాల బారిన పడ్డారు ఈ జ్వరాల బారిన పడిన వారికి కాళ్లు వాపులు కీళ్ల నొప్పులు వస్తున్నాడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ మేరకు చిరమణ పీహెచ్సీ వైద్యాధికారిని డాక్టర్ జ్యోతి రాణి గత నాలుగు రోజుల నుండి కావలి ఎడవల్లి గ్రామంలో ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జ్వరాలు తగ్గుముఖం పడ్డాయని తెలిపారు వైరల్ జ్వరాలు కావడంతో ఒళ్ళు నొప్పులు ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు పౌష్టికాహారం తీసుకోవాలని సూచనలు తెలిపారు శుక్రవారం వరకు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెచ్ వి సలోమి ఎం ఎల్ హెచ్ పి పరిమళ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు