వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి పూజా కార్యక్రమం
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కి పూజా కార్యక్రమం
తిరుపతి జిల్లా కుందకూరు గ్రామం కనుమురాయుని కొండపై వెలసియున్న కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీశ్రీశ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు, పూజా కార్యక్రమం అభిషేకం, అన్నదానం దాతలుగా బత్తలసుబ్బారెడ్డి, బత్తల సుజిత్ రెడ్డి వ్యవహరించడం జరిగింది.ఇక్కడ ప్రతి శనివారం వైభవంగా స్వామి వారికి పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది. వివిధ గ్రామాల నుండి కనుమ రాయుని కొండపైకి భక్తులు వచ్చేందుకు గొల్లపల్లి గ్రామం నుండి కొండపైకి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం, శనివారం రోజు కుందకూరు, వెడిచర్ల గ్రామాల ప్రజలు కొండపైకి వచ్చేందుకు బస్సును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న పారిశ్రామికవేత్త బత్తల సుబ్బారెడ్డి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధి కొరకు తన సొంత డబ్బులను ఖర్చు చేసినట్లు, గత నాలుగు రోజుల నుంచి కూడా చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయి స్తున్నారని అన్నారు. రాబోయే శ్రీశ్రీశ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకొని , భక్తుల సౌకర్యార్థం అన్ని పనులను త్వరగా చేయిస్తామని ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈరోజు స్వామివారికి ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో బత్తల సుబ్బారెడ్డి, బత్తల సుజిత్ రెడ్డి,మోపాటి బాబు రెడ్డి, కుందకూరు సర్పంచ్ ఇనమాల శీనయ్య, మనుబోలు కృష్ణయ్య, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, కుందుకూరు గ్రామ ప్రజలు, స్వామి వారి భక్తులు పాల్గొన్నారు.