సామాజిక సేవలో పోలీస్....

నెల్లూరుజిల్లా కలిగిరి సర్కిల్ పరిధిలోని వింజమూరులో పోలీసులు తమ విధుల్లో భాగంగా సామాజిక సేవకు శ్రీకారం చుట్టి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటు వేసేందుకు వచ్చిన అనారోగ్య బాధితునికి స్వయంగా చేయూతను అందించి పోలింగ్ కేంద్రం వద్దకు చేర్చి మానవతా దృక్పధమును చాటుకున్నారు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది డేగా మాధవరావు కు కలిగిరి సి ఐ సాంబశివరావు, ఎస్ ఐ జంపాని కుమార్ లు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.