పోలీస్ డైరీ-2025 ఆవిష్కరించిన జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ 





నెల్లూరు క్రైం మేజర్ న్యూస్:

జిల్లా పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం పోలీస్ డైరీ ని  ఎస్పీ జి కృష్ణ కాంత్ శనివారం స్థానిక ఉమేష్ చంద్ర సమావేశం మందిరంలో  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ    పోలీస్ డైరీ సమగ్ర సమాచారంతో ఎంతో సవివరంగా ఉందని, పోలీస్ సిబ్బందికి ఎంతో ఉపయోగంగా కనిపిస్తోందని తెలిపారు.  ఇంతకు సమాచారంతో డైరీ ని ముందుకు తీసుకు వచ్చిన పోలీసు అధికారుల సంఘాన్ని ప్రత్యేకంగా అభినందించారు. సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్ రావు మాట్లాడుతూ డైరీ తయారు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ తో పాటు ఇతర అధికారులకు, సంఘంలోని సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో  ఎస్ బి డి.ఎస్.పి  శ్రీనివాసరావు, నగర, రూరల్ డిఎస్పీలు శ్రీనివాసులు రెడ్డి, ఘట్టమనేని శ్రీనివాసరావు,    మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి చెంచు రామారావు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు  తురక శ్రీనివాసులు,   పెంచల ప్రసాద్, రఫీ, నవీన్, నవీద్, సుధాకర్ రెడ్డి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.