దొరవారిసత్రంలో సర్వసభ్య సమావేశం

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం న్యూస్:- మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న సమావేశ మందిరంలో మంగళవారం సర్వసభ్య సమావేశాన్ని ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముందుగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో త్రాగునీరు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు ఇదే క్రమంలో గ్రామాలలో పారిశుధ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాలని రానున్నది వర్షాకాలం గ్రామాల్లో అపరిశుభ్రంగా ఉండడం వల్ల వ్యాధులు సోకుతాయని కాబట్టి పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు తెలియజేశారు అనంతరం మండల పలు శాఖ అధికారులు వారిచే విధులపై రివ్యూ నిర్వహించడం జరిగినది తాసిల్దార్ గోపిరెడ్డి మాట్లాడుతూ రీసర్వే గురించి తెలియజేశారు ఎంపీడీవో సింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సురక్ష పథకంపై తెలియజేశారు అనంతరం వైసిపి సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు దువ్వూరు గోపాల్ రెడ్డి మండలంలో ఈ ఏడాది పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి పాసైన ఆణిముత్యాలను ఒక్కొక్కరికి ఎనిమిది మంది విద్యార్థులకు 2000 రూపాయలు నగదు చొప్పున ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ చేతుల మీదగా అందిస్తూ వారికి శాలువాతో సన్మానం చేయడం జరిగింది ఈ ఆణిముత్యాలు కేజీబీవీ పాఠశాల విద్యార్థులు బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడంతో వారికి ఈ బహుమతులు సన్మానం దక్కిందంటూ ఆయన తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు బాగా చదువుకొని ఇంకా మంచి మార్కులతో పాసై పాఠశాలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ కృష్ణయ్య ఏపిఎం పద్మావతి ఏపీవో విజయభాస్కర్ మండల పలు శాఖ అధికారు సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు తదితరులు