మొక్కలను నాటి రక్షించుకోవాలి...

మొక్కలను నాటిన సబ్ ఇన్స్పెక్టర్ కె.గోపి...

చిట్టమూరు రవి కిరణాలు

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని రక్షించాలని ఎస్సై గోపి పేర్కొన్నారు. సోమవారం చిట్టమూరు మండలంలోని అరవపాలెం శ్రీ సన్నారెడ్డి బాలకృష్ణారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో సుమారు75పై మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో జనాభా పెరుగుదలతో పాటు వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతుందని దాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటి బాధ్యతగా వాటిని రక్షించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎ. ప్రభావతి,పాఠశాల సిబ్బంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.