చెట్లు నాటడం వల్ల మనిషి యొక్క జీవనశైలి మారుతుంది:- ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-

 సూళ్లూరుపేట పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం అటవీశాఖ అధికారుల సమక్షంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  సూళ్లూరుపేట శాసన సభ్యురాలు డా" నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లు నాటడం లో ప్రతి ఒక్కరూ జీవిత భాగం కావాలని,ఈ చెట్లు నాటడం వల్ల ప్రతి ఒక్క మనిషి యొక్క జీవనశైలి మారుతుందని, పట్ట ణాల్లో గ్రామాల్లో ప్రతి ఇంటి చుట్టూ చెట్లను నాటాలని, ఇళ్ల చుట్టూ పరిసరాలను శుభ్రపరుచుకుని ప్రతి ఒక్కరు చెట్లు నాటి పచ్చదనంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు, ప్రభుత్వ అధికారులు, తెలుగుదేశం పార్టీ  జిల్లా అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి, సులూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్ , రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు పచ్చ మాధవ నాయుడు,సులూరుపేట పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ పాల్గొన్నారు. వీరితోపాటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.