స్తంభాలే మిగిలిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు

కొండాపురం, మేజర్ న్యూస్:: గ్రామం శుభ్రంగా ఉండడంతోపాటు గ్రామ పంచాయితీలకు అదనపు ఆదాయం అందాలనే లక్ష్యంతో చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని ఇండ్ల నుండి సేకరించిన తడి, పొడి వ్యర్థాలతో ఎరువు తయారు చేయడం, ఆ ఎరువులు రైతులకు విక్రయించడం. జరగాలి. అయితే మండలంలోని పార్లపల్లి, భీమవరప్పాడు గ్రామాలలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అధికారుల ఉదాహరణతో లక్ష్యం నెరవేరడం లేదు. 2017లో రూ.3.48 లక్షల అంచనా విలువతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి గ్రామీణ హామీ పథకంలో భాగంగా పార్లపల్లి గ్రామంలో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం పనులను ప్రారంభించారు. 199 పనిదినాలలో 2018లో ఈ పనిని ముగించారు. కొన్నాళ్లపాటు నిర్వహణ సజావుగా సాగింది. తుఫాను సమయంలో ఈదురు గాలులకు తయారీ కేంద్రంపై వేసిన కొన్ని రేకులు ఎగిరిపోయాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో మిగిలి ఉన్న రేకులు ఒక్కొక్కటిగా  కనుమరుగయ్యాయి. సంపద తయారీ నిలిచిపోయింది. ప్రస్తుతం స్తంభాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. పరిసర ప్రాంతాలన్నీ కంపచెట్లతో కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంపద తయారీ కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుచున్నారు.