పెట్రో ధరల పరుగో పరుగు..!
దిల్లీ : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఏడోరోజూ పెరిగాయి. సోమవారం (11-10-2021) లీటర్ పెట్రోల్‌పై 30 పైసలు, డీజిల్‌పై 35 పైసల వరకు పెరిగింది. దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.104.44, డీజిల్ రూ.93.17కి చేరింది. వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ ధరలు వరుసగా రూ.110.41, రూ.101.03గా ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరుగుదల కారణంగానే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ బ్రెంట్ ముడిచమురు ధర 82 డాలర్లకు ఎగబాకింది. దీనికి తోడు రోజుకి 0.4 మిలియన్ల బ్యారెళ్లకు మించి ఉత్పత్తిని పెంచొద్దన్న ఒపెక్ కూటమి నిర్ణయం చమురు ధరలపై ఒత్తిడి పెంచుతోంది. నెల క్రితం బ్రెంట్ బ్యారెల్ ధర 72 డాలర్లుగా ఉండింది.
ప్రధాన నగరాల్లో లీటర్ డీజిల్, పెట్రోల్ ధరలు..
నగరం పెట్రోల్(రూ.లలో) డీజిల్(రూ.లలో)
హైదరాబాద్ 108.64 101.66
విజయవాడ 110.63 103.05
విశాఖపట్నం 109.50 101.97
దిల్లీ 104.44 93.17
ముంబయి 110.12 101.03
చెన్నై 101.89 97.69
బెంగళూరు 108.08 98.89