విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి..
వాకాడు, జనవరి09, (రవికిరణాలు) : వాకాడు మండలం, కల్లూరు పంచాయితీ పరిధిలోని సిద్ధిగుంటపాళ్ళెం గ్రామంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో పాటు మృతిని తొందరపాటు వెరసి ఓ నిండు ప్రాణం బలైంది. గ్రామానికి చెందిన చేవూరు కిషోర్ అనే 28 ఏళ్ళ వ్యక్తి తన పంటపొలాలకు సమీపంలో ఉన్న ట్రాన్స్ పార్మర్ వద్ద విద్యుత్ షాక్ గురై మృత్యువాత పడ్డాడు. స్టానికులు తెలిపిన వివవరాల మేరకు గ్రామంలోని ట్రాన్స్ ఫార్మర్ ద్వారా కిషోర్ పంట పోలాలోని మోటార్ కనెక్షన్ కు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది..ఈ క్రమంలో తానే ట్రాన్స్ ఫార్మర్ వద్దకు వెళ్లి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లో విద్యుత్ కనెక్షన్లు మార్చే ప్రయత్నం చేశాడు. అయితే 11కెవి ద్వారా సరఫరా అవుతున్న విషయన్ని గుర్తించలేని కారణంగా విద్యుదాఘాతానికి గురై ట్రాన్స్ ఫార్మర్ పైనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక విద్యుత్ సరఫరా నినిపివేసి మృతదేహాన్ని కిందకి దించారు. అయితే గతంలో ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఎన్నో ప్రమాదాల జరిగాయని, ప్రమాద స్థలం వద్ద ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించినా పట్టించుకోక పోవడం కారణంగానే నిండు ప్రాణం బలైనట్లు గ్రామస్తులు మండిపడుతున్నారు.