టపాసుల దుకాణాలకు అనుమతులు తప్పనిసరి ఎస్సై వెంకట రాజేష్




రాపూరు మేజర్ న్యూస్ 

 దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని మండలంలోని టపాసుల దుకాణదారులు తప్పనిసరిగా పోలీసుల అను మతులు తీసుకోవాలని ఎస్సై వెంకట రాజేష్ తెలిపారు.పోలీస్ స్టేషన్లో ఎస్సై మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాల యజమానులపై చట్టపరమైన చర్య లు తీసుకోవడం జరుగుతుందన్నారు. టపాసుల దుకాణాల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దుకాణదారులు తగు జాగ్రత్తలను పాటించాలన్నారు. మండల ప్రజలందరూ దీపావళి పర్వదినాన్ని సంతోషంగా జరుపుకోవాలని శుభా కాంక్షలు తెలియజేశారు.