రోడ్డు ఆక్రమణ పై తాసిల్దార్ కి వినతి పత్రం సమర్పించిన జన సైనికులు...

చిట్టమూరు   రవికిరణాలు ప్రతినిధి-: చిట్టా మూరు మండల పరిధిలోని యాకసిరి పాటిమిట్టలో గత రెండు నెలల నుండి ఒక భూస్వామి రోడ్డు మార్జిన్ ను మరియు పశువుల త్రాగునీటి గుంటకు నీరు వెళ్లే కాలవను అడ్డగించుకొని తమ పొలంలోకి కలుపుకున్నాడని, తాసిల్దారు పరిశీలించి న్యాయం చేయాలని చిట్టమూరు మండల జనసేన నాయకులు క్రాంతి, రాము తాసిల్దార్ విజయలక్ష్మి కి సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తాసిల్దార్ కి వివరిస్తూ, గత రెండు నెలల కాలంలో పాటిమిట్ట గ్రామంలో ఉన్న ఒక భూస్వామి బీసీ కాలనీ సమీపంలో గల పంచాయతీరాజ్ ప్రాజెక్టు పరిధిలో వేసిన తారు రోడ్డు మార్జనును తమ పొలంలోకి కలుపుకొని రోడ్డుపై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాడని, అంతేకాక పాటిమిట్ట గ్రామంలో పశువులు త్రాగునీటి గుంట గా ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న చలివేంద్ర గుంటకు నీరు వెళ్లే కాలువను తమ పొలంలో కలుపుకొని గుంటకునీరు పోనీయకుండా అడ్డుపడుతున్నాడని, అంతేకాక గ్రామం హద్దులకు తమ పొలం హద్దులకు మధ్యలో ఉన్న సర్వే రాళ్లను పెరికి వేసి తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని, ఈ విషయమై గతంలో ఉన్న తాసిల్దార్ కి పలు పర్యాయాలు తెలియజేశారని, కానీ అధికారులు తూతూ మంత్రంగా వచ్చి పరిశీలన చేశారే తప్ప ఆక్రమణదారుడుపై, ఎప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాసిల్దార్ విజయలక్ష్మి కి జన సైనికులు తెలిపారు. వీరు వెంట జనసేన కార్యకర్తలు సాల పక్షి సుధాకర్, సాల పక్షి వెంకటేశ్వర్లు, పలువురు జనసేన కార్యకర్తలు ఉన్నారు.