లబ్ధిదారుల ఇంటికే పెన్షను నగదు
- కమిషనర్ పివివిస్ మూర్తి
వృద్ధులు, దివ్యంగుల సౌకర్యార్థం సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న నూతన విధానంలో వైఎస్సార్ పెన్షను పధకం లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షను నగదును అందజేస్తున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ పివివిస్ మూర్తి ప్రకటించారు. కార్యాలయంలో ఆయన చాంబర్లో పెన్షను విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఒకటవ తేదీన జరిగే పంపిణీ కార్యక్రమంపై విశ్లేషించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫిబ్రవరి నెలలో తొలగించిన పెన్షనులను రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించి లబ్ధిదారులకు మార్చి నెలలో రెండు నెలల నగదును అందజేస్తామని తెలిపారు. తొలగించిన అన్ని పెన్షన్లు తిరిగి అందిస్తున్నామని, పెన్షనులను పునరుద్ధరిస్తామనే దళారుల మాటలు విని మోసపోవద్దని కమిషనర్ సూచించారు.