పెంచలరెడ్డిని సన్మానించిన మంత్రి మేకపాటి
నెల్లూరు, జనవరి 31, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లాలో జిల్లా అధికారిగా వివిధ హోదాలలో పని చేస్తూ ప్రస్తుతం పరిశ్రమలు వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దగ్గర ఓఎస్డీ గా పని చేయుచున్న చల్లా పెంచలరెడ్డి నేడు పదవి విరమణ చేయు సందర్భంగా వారిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్-2 గా పని చేయుచున్న వి.ఆర్ చంద్రమౌళి పాల్గొన్నారు.