దొరవారిసత్రం రెగ్యులర్ డిప్యూటీ తహశీల్దార్ గా పెళ్లూరు గోపినాధ్ రెడ్డి 


 నెల్లూరుజిల్లా. దొరవారిసత్రం: దొరవారిసత్రం మండలం రెగ్యులర్ డిప్యూటీ తహశీల్దార్ గా పెళ్లూరు గోపినాధ్ రెడ్డిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు ఉత్తర్వులు జారీచేశారు.వెంకటగిరి మండలం స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్ గా పనిచేస్తున్న గోపినాధ్ రెడ్డి బదిలీపై దొరవారి సత్రం మండలం రెగ్యులర్ డిప్యూటీ తహసీల్దార్ గా నియమితులయ్యారు.బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. నాయుడుపేట ఆర్డీఓ  కార్యాలయం తోపాటు సూళ్లూరుపేట నియోజకవర్గంలో  పలు రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పని చేసిన పెళ్లూరు గోపినాధ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. గోపిరెడ్డిగా పిలవబడే డిప్యూటీ తహశీల్దార్ గోపినాధ్ రెడ్డి సౌమ్యుడు మంచివారనే పేరుంది.