ఏ పి జె ఏ సి తిరుపతి జిల్లా చైర్మన్ గా పెళ్ళూరు గోపీనాథ్ రెడ్డి.
 
రవి కిరణాలు, తిరుపతి జిల్లా, దొరవారిసత్రం:-
 
 ఏ పి జె ఏ సి తిరుపతి జిల్లా చైర్మన్ గా  దొరవారిసత్రం  తహశీల్దార్  పెళ్లూరు గోపినాధ్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కర్నూలు లో జరిగిన ఏ పి జె ఏ సి 3వ మహాసభలు నిర్వహించారు. ఈ సందర్బంగా నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా రెవిన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా పనిచేస్తున్న పెళ్లూరు గోపినాథ్ రెడ్డి ఏపి జె ఏ సి తిరుపతి జిల్లా చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చిట్టమూరు  మండలం తీరప్రాంతమైన బురదగాలి  కొత్తపాలెం గ్రామంలోని రైతు కుటుంబంలో జన్మించిన గోపిరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వివిధ కళాశాలల్లో విద్యార్థి నాయకుడుగా,ఓ జాతీయ పార్టీ లో వివిధ హోదాల్లో పనిచేశారు.2002 లో రెవిన్యూ శాఖలో  ఉద్యోగంలో చేరి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.సూళ్లూరుపేట నియోజకవర్గంలో వివిధ రెవెన్యూ కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన గోపినాధ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు,గోపిరెడ్డి గా పిలువబడే  ఆయన సౌమ్యులు,మంచి వారనే పేరుంది.గతంలో పెళ్ళూరు  గోపీనాథ్ రెడ్డి సూళ్లూరుపేట తాలూకా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా,ఉమ్మడి నెల్లూరు జిల్లా లో చిట్టామురు మండలం వి.అర్.ఓ సంఘం అధ్యక్షులుగా,చిట్టామురు,కోట, వాకడు మండల వి.అర్.ఓ ల సంఘం అధ్యక్షులుగా,నెల్లూరు జిల్లా వి.అర్.ఓ ల సంఘం అధ్యక్షులు గా నాయుడుపేట తాలూక  ఏ పీ ఎన్ జి ఓస్ కార్యదర్శిగా,నాయుడుపేట డివిజన్ రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులుగా,తిరుపతి జిల్లా రెవిన్యూ సర్వీసెస్ అషోషియేషన్, కన్వీనర్,ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న పెళ్ళూరు గోపీనాథ్ రెడ్డి  నేడు ఏపి జె ఏ సి తిరుపతి జిల్లా చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూఏ పి జె ఏ సి తిరుపతి జిల్లా చైర్మన్ గా తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ఏ పి జె ఏ సి అమరావతి చైర్మన్ బొప్పరజు వెంకటేశ్వర్లు,తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పెళ్లూరు.గోపీనాథ్ నియామకం పట్ల తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు,స్నేహితులు హర్షం  వ్యక్తం చేశారు.ఈ సందర్బంగా బాణ సంచా కాల్చి,కేకులు కట్ చేసి పంచిపెట్టారు.