తేది: 26-02-2023,
తిరుపతి.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధ్యక్షతన జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో పాల్గొన్న
 పేర్నాటి. 
 ఈరోజు తిరుపతిలోని పిఎల్ఆర్ గ్రాండ్ నందు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
గారు, మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గార్ల అధ్యక్షతన జరిగిన ఉమ్మడి
 చిత్తూరు  జిల్లాకు సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులతో జరిగిన 
పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల సన్నాక సమావేశంలో పాల్గొన్న తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి
 శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి గారు, టూరిజం 
శాఖ మాత్యులు ఆర్కే రోజా గారు, ఎంపీలు రెడ్డప్ప గారు, మద్దెల గురుమూర్తిగారు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు,
 కోనేటి ఆదిమూలం గారు, బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి ద్వారక్ నాద రెడ్డి గారు, నవాజ్ భాషా గారు, చింతల 
రామచంద్రారెడ్డి గారు, ఆరని శ్రీనివాసులు  గారు, ఎమ్మెల్సీ KRJ భరత్ గారు, చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు
 గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు
 ఈ సమావేశానికి విచ్చేశారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల  ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత 
ప్రాధాన్యత సంతరించుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి నియోజకవర్గాల 
వారీగా ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులతో విడివిడిగా సమావేశం నిర్వహించి, నామినేషన్ ప్రసన్న తేదీ అనంతరం బాలెట్ నమూనా 
వచ్చిన తర్వాత మరొక్కసారి ప్రతి ఓటరును కలిసి విధంగా కార్యాచరణ రూపొందించి, నాయకులకు బాధ్యతలు అప్పజెప్పాలని 
తెలిపారు. ఉద్యోగరీత్యా దూర ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని గుర్తించి, 13-03-2023 తేదిన జరగనున్న  ఎన్నికల నాటికి తీసుకొచ్చి 
ఓటు వేసే విధంగా పని  చేయాలని తెలిపారు. అత్యధిక మెజారిటీతో శ్యాంప్రసాద్ గారిని గెలిపించి శాసనమండలిలో కూర్చోబెట్టాల్సిన 
బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
పాల్గొన్నారు.