సకాలములో పన్నులు చెల్లించండి-నగరాభివృద్ధికి తోడ్పడండి కమిషనర్ సూర్యతేజ





నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్) 

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని భవన యజమానులు కొందరు కార్పొరేషన్ కు చెల్లించవలసిన ఆస్తి, కుళాయి, డ్రైనేజీ మరియు ఇతర పన్నులు సకాలంలో చెల్లించుచు నగర అభివృద్ధికి సహకరిస్తున్నారని వారికి కమిషనర్ సూర్య తేజ అభినందనలు తెలియజేశారు. మరి కొంతమంది భవన యజమానులు కార్పొరేషన్ కు చెల్లించవలసిన పన్ను బకాయిలు అధిక శాతంలో ఉన్నాయని, కావున అట్టి భవన యజమానులు వారి భవనాలకు సంబంధించి ఆస్తి, కుళాయి, డ్రైనేజీ మరియు ఇతర పన్నుల బకాయిలను వెంటనే చెల్లించవలసిందిగా కమిషనర్ నగర ప్రజలను కోరారు. అదేవిధంగా సకాలంలో బకాయిలు చెల్లించని భవన యజమానులకు సంబంధిత కుళాయి, డ్రైనేజీ మరియు విద్యుత్ కనెక్షన్లు వంటి అత్యవసర సేవలను నిర్మూలన చేస్తామని భవన యజమానులకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.