తేది: 08-03-2023

మహిళా సాధికారతకు పవనన్న పెద్ద పీట
-పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 296వ రోజున 46వ డివిజన్ ట్రంకురోడ్డులో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి దుకాణాన్ని, ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలతో పాటు మహిళామణులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకంక్షాలు తెలిపారు. ట్రంకురోడ్డులో అనేక దుకాణాలను సందర్శించిన కేతంరెడ్డి ఆ దుకాణాల్లో యజమాని స్థాయి నుండి వివిధ హోదాల్లో పనిచేస్తున్న మహిళల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనదని, ఇక్కడ దుకాణాల్లో అనేకమంది మహిళలు నిరంతరం కష్టపడుతూ తమ ఇంటికి ఆర్థికంగా కూడా అండగా నిలుస్తున్నారని, మహిళా సాధికారతకు ఇది తొలి మెట్టు అని అన్నారు. కాయకష్టం చేసి కుటుంబానికి అండగా నిలిచే మహిళలంటే పవన్ కళ్యాణ్ గారికి ఎనలేని గౌరవం అని అన్నారు. రానున్న రోజుల్లో పవనన్న ప్రభుత్వంలో మహిళా సాధికారతకు పవన్ కళ్యాణ్ గారి పెద్ద పీట వేస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. మహిళల భద్రతా చట్టాలను పటిష్టం చేయడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం, మహిళల స్వయం ఉపాధి కోసం ప్రత్యేక సబ్సిడీ తో రుణాలను ఇవ్వడం, ప్రతిభ కల్గిన మహిళలకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా 10 లక్షల వరకు ఆర్ధిక సాయం అందించడం వంటివి పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయ్యేలా అండగా నిలవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.