పాటిమిట్ట యానాది కాలనీకి దారి చూపాలి
పాటిమిట్ట యానాది కాలనీకి దారి చూపాలి
ఆర్డీవో కార్యాలయం ఎదుట యానాదులు ధర్నా
రాష్ట్ర యానాదుల సంఘం అధ్యక్షులు కల్లూరు చిన్న పెంచలయ్య డిమాండ్
సూళ్లూరుపేట, రవి కిరణాలు, ఏప్రిల్ 10:-
సూళ్లూరుపేట మండలం కడపట్ర పంచాయతీ పరిధిలోని పాటిమిట్ట గిరిజన కాలనీకి దారి చూపాలంటూ సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట యానాదులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు చిన్న పెంచలయ్య మాట్లాడుతూ 35 ఏళ్లుగా యానాదులు నివాసముంటున్న నేటికీ నివాస గృహాలు గోడల దశలో వదిలేసిన ఇల్లు స్లాబ్ పోయకపోవడం ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓట్లు లేకపోవడం సచివాలయ సిబ్బంది బిఎల్వోలు పనిచేస్తున్నారా లేదా అని ప్రశ్నించారు కొందరు భూస్వాములు నివాస గృహంలోనికి వెళ్లేందుకు దారి లేకుండా చేశారని అడ్డుగా కంపచెట్లు ముళ్ళ చెట్లు వేసి అడ్డుకుంటున్నారని ఈ విషయమై జిల్లా కలెక్టర్ ఆర్డిఓ కలసి వినతిపత్రం అందజేశామని ఆర్డిఓ పాటిమిట్ట యానాదుల కాలనీకి వచ్చి ఇక్కడ ఉండవద్దని ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ ప్రదేశంలో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు వారంలోపు గిరిజనులకు దారి చూపకపోతే రిలే నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు యానాదుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని మండిపడ్డారు రావాల్సిన సంక్షేమ పథకాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేటికీ సంక్షేమ పథకాలు అందడం లేదని తెలిపారు అనంతరం కార్యాలయ సూపర్డెంట్ ఆదిశేషయ్యకు వినత పత్రం ఇచ్చి ఈ సమస్యలను పరిష్కరించాలంటూ అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాకాని వెంకటేశ్వర్లు ,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెంబెటి ఉష, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ పుత్తూరు శ్రీనివాసులు ,ఎల్లపల్లి రమేష్ ,ఇండ్ల రమ్య తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు తలపల మల్లికార్జునరావు, నెల్లూరు జిల్లా అధ్యక్షులు తిరువీధి సతీష్ చంద్ర, కోశాధికారి ఎల్లపల్లి రమేష్ ,పొట్లూరు భాగ్యలక్ష్మి, పొట్లూరు శ్రీనివాసులు, బండి బత్తయ్య మరియు గిరిజనులు పాల్గొన్నారు.