పాస్టర్స్ గౌరవవేతనాన్ని కొనసాగించాలి 




పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనోక్ 


నెల్లూరు: పాస్టర్స్ గౌరవ వేతనాన్ని కొనసాగించాలని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనోక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాస్టర్స్ అనే వారు దేశం, రాష్ట్రం బాగుండాలని ప్రార్ధించే వారని అలాంటి వారి కోసం వున్న ఏకైక పథకం గౌరవ వేతనమేనని అన్నారు.గత ప్రభుత్వం గౌరవ వేతనం ఇచ్చేదని తెలియజేశారు.  ఈ సందర్భంగా నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సేవకుల సంక్షేమం కోసం గౌరవేతన పథకాన్ని కొనసాగించాలని కోరారు. అనంతరం భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కె ఎస్ రాజు, సదాశివరావు,ప్రధాన కార్యదర్శి ఏ రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జాషువా, కోశాధికారి కిషోర్ కుమార్,సహాయ కార్యదర్శిలు శ్యామ్ ప్రసాద్, సుధీర్ బాబు, కార్యవర్గ సభ్యులు ఎనోష్, గిద్యోని తదితరులు పాల్గొన్నారు.