ఈ రోజు తిరుపతిలోని వైయస్ఆర్ మార్గ్ నందు డిపిఆర్ కళ్యాణమండపంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న తూర్పు రాయలసీమ పట్టబద్ధుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు.
 తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి గారు వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని తిరుపతి నియోజకవర్గ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు పరిచయం చేశారు.
 ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి గారు మాట్లాడుతూ మార్చి నెలలో శాసనమండలికి పట్టబధ్రుల నియోజకవర్గ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన ప్రియతమ నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు మన పార్టీ అభ్యర్థిగా గూడూరుకు చెందినటువంటి, ఆ నియోజకవర్గంలో చాలా ప్రాధాన్యం, పలుకుబడి ఉన్నటువంటి, అదేవిధంగా మన పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న గెలుపు కోసం నెల్లూరు జిల్లా మొత్తం నిరంతరం కృషి చేసిన తమ్ముడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించాలని తెలిపారు.
 అదేవిధంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని మన అభ్యర్థిగా సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగిందని,  పార్టీకి చాలా బాగా పనిచేసాడు, ఎమ్మెల్యే కావలసినటువంటి వ్యక్తి గూడూరు నియోజకవర్గం రిజర్వుడు నియోజకవర్గం కనుక అవకాశం ఇవ్వలేకపోయామని, కనుక శ్యామ్ శాసనమండలి సభ్యుడైతే, పార్టీకి చాలా మంచిగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు చెప్పారని నాయకులను ఉద్దేశించి తెలిపారు.
 36 నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తిరుపతి నుంచి అత్యధిక మెజారిటీ తీసుకువచ్చేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు, అధికారాన్ని నెత్తికెక్కించుకోకుండా, ప్రజా సేవకులుగా పనిచేసి, తూర్పు రాయలసీమ శాసనమండలి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన భాద్యత పార్టీ శ్రేణులపై ఉందని శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి సూచించారు.
పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా నాకు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని, గౌరవనీయులు పెద్దలు తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి గారు గారికి, జనంతో ఎల్లప్పుడూ మమేకమవుతూ ప్రజల మనల్ని పొందుతున్న భూమన అభినవ్ గారికి నా కృతజ్ఞతలు అని తెలిపారు. తూర్పు రాయలసీమకు సంబంధించిన 36 నియోజకవర్గాల్లో దాదాపుగా 24 నియోజకవర్గాల్లో సమావేశాలు జరిగాయని, ఈ నియోజకవర్గంలో వచ్చినంత మహిళలు ఏ నియోజకవర్గంలో రాలేదని, నా సతీమణికి విత్తనాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్ పదవినిచ్చినప్పుడు నేరుగా మన ముఖ్యమంత్రి గారితో మాకు ఈ పదవి వద్దని చెప్పానని,  జగన్ మోహన్ రెడ్డి గారు మా చెల్లికి ఇస్తున్నాను అని విత్తనాభివృద్ధి సంస్థ పదవి మా కుటుంబానికి ఇచ్చారని,ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళామణులందరిని చూసిన తర్వాత నేను ఆరోజు తప్పు చేశానేమో అని అనిపిస్తుందని, ఈ నియోజకవర్గంలో కరుణాకర్ అన్న, అభినయ్ సారధ్యంలో రాజకీయాల్లో మహిళలు మరింత  బాధ్యతతో పని చేస్తున్నారని తెలిపారు, మీరందరూ కూడా ఓటర్ల నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని, నియోజకవర్గంలో ఎక్కువ మంది ఓటర్లను చేర్పించి, నా విజయాన్ని కృషి చేయాలని పిలపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, నగర అధ్యక్షులు పాలగిరి ప్రతాప్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, మల్లం రవిచంద్ర రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్కె బాబు, టౌన్ బ్యాంకు చైర్మన్ కేతం జయచంద్ర, గంగమ్మ గుడి చైర్మన్ కట్టా గోపియాదవ్, స్టేట్ విలెజ్ & ఖాదీ కార్పొరేషన్ డైరెక్టర్ దుద్దెలు బాబు, ఇతర సీనియర్ నాయకులు, స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు,అనుబంధ విభాగాల నాయకులు, పాల్గొన్నారు.