చెంగాళ్ళమ్మ ఆలయలో జరిగే  కుంభాభిషేకం లో పాల్గొనండి.

మూడు రోజులు పాటు జరిగే లక్ష కుంకుమార్చనకు భక్తులు విచ్చేయండి.
 
24 ఉదయం 7 గం కుంభాభిషేకం కు
రండి అందరు పాల్గొనండి.
చైర్మన్ బాలచంద్ర రెడ్డి విజ్ఞప్తి.

రవి కిరణాలు, తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట:-

సూళ్లూరుపేట లో వెలసి ఉన్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో స్వర్ణ తాపడం తో
సిద్దమైన విమాన గోపురం కుంభాభిషేకం వేడుకల్లో అందరు పాల్గొనాలని ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆలయ ఆవరణం లో జరిగిన విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడుతూ, 22 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ నూతన స్వర్ణ విమాన గోపురం శిఖర ప్రతిష్ట,మహా కుంబాభిషేక మహోత్సవం లో భాగంగా ప్రతి రోజు లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేసారు,
24 వ తేదీ ఉదయం 7 గంటలకు గోపురాల పై కలిశ స్థాపనలు కుంభాభిషేకం ఉంటుందని
ఈ కుంభాభిషేకం వేడుకలను కనులారా వీక్షించిన వారికి మంచి జరుగుతుందని చైర్మన్
తెలియజేసారు, ఆలయ ఈఓ ఆళ్ళ శ్రీనివాసులు రెడ్డి నేతృత్వం కుంభాభిషేకం వేడుకల
ఏర్పాట్లను ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ట్రస్ట్ సభ్యులు సహకారాన్ని అందజేస్తున్నారు.