శ్రీ చెంగాళమ్మ కు పరమేశ్వరి అలంకారం.
 
గొల్లలములువు నుండి అమ్మణ్ణికి సారె.

తిరుపతి జిల్లా.
సూళ్లూరుపేట:-

 కాళ్ళంగి నది ఒడ్డున వెలసి ఉన్న భక్తుల కొంగుబంగారం దక్షిణముఖ కాళీ తెలుగు, తమిళ ఆరాధ్య దైవం శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం లో జరుగుతున్న
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం సాయంత్రం గొల్లలములువు గ్రామం నుండి
అమ్మణ్ణికి ఆడపడుచు సారెను గ్రామస్థులు డప్పులు, మంగళ వాయిద్యాలతో  ఊరేగింపుగా చెంగాలమ్మ ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ముందుగా గ్రామంలో సారె కు పూజలు చేసి గ్రామస్తులంతా కలిసి ఆలయ చైర్మన్ దువ్వూరు బాలచంద్ర రెడ్డి కి, ఈఓ ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి తో పాటు ట్రస్ట్ సభ్యులకు ,వేనాటి సతీష్ రెడ్డికి శాలువాలు కప్పి
గ్రామమర్యాదలు అందించారు.అనంతరం గొల్లలములువు గ్రామం నుండి గ్రామస్తులు
డప్పు వాయిద్యాలతో, వీర జాటీలతో సందడి చేస్తూ ఆలయం వరకు సారెను తీసుకొచ్చారు,ఆలయం వద్ద మాజీ ఆలయ చైర్మన్ వేనాటి రామచంద్ర రెడ్డి
సారె కార్యక్రమం లో పాల్గొని చెంగాళమ్మ చెట్టు వద్ద పూజలు చేశారు,అనంతరం మహిళలంతా అమ్మణ్ణి సన్నిధి లోకి చేరుకొని సారెను స్వయంగా అమ్మణ్ణికి సమర్పించారు.

అమ్మణ్ణికి పరమేశ్వరి అలంకారం

దసరా వేడుకల్లో భాగంగా మొదటి రోజు అమ్మణ్ణికి పరమేశ్వరి అలంకారం చేశారు, ఆలయ
చైర్మన్ , ఈఓ ఆలయంలో జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు.అనంతరం వేదపండితులు
అలంకార పూజలు చేసి హారతులిచ్చారు, ఈ సందర్భముగా జరిగిన కుంకుమ పూజల్లో
ఉభయదాతలు పాల్గొన్నారు, అలంకార ఉభయదాతలు శింగన ఓబుల్ రెడ్డి దంపతులు
కాగా ఈ వేడుకల్లో ఆలయ ట్రస్ట్ సభ్యులు ముప్పాళ్ల చంద్ర శేఖర్ రెడ్డి,వంకా దినేష్ కుమార్ యాదవ్,ఓలేటి బాల సత్యనారాయణ,మన్నెముద్దు పద్మజ, బండి సునీత తదితరులు పాల్గొన్నారు.