వేణుబాక గ్రామంలో మన ఇల్లు మన జనసేన  రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం :-  మండల పరిధిలోని వేణుంబాక పంచాయితీలో  "మన ఇల్లు -  మన జనసేన" కార్యక్రమం ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవారి సత్రం మండలం  వేణుంబాక పంచాయితీలో  సుమారు 200 పైగా కుటుంబాలను సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో జనసేన పార్టీ దొరవారిసత్రం మండల ప్రధాన కార్యదర్శి మణి ఆధ్వర్యంలో  మన ఇల్లు - మన జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ , స్థానిక సమస్యలు గురించి ప్రజలనే నేరుగా అడగగా నేషనల్ హైవే నుంచి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మరియు అంతర్గత సిసి రోడ్లను నిర్మించాలని, అలానే పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లాంటి పలు సమస్యలను  గ్రామస్థులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా అధికారులతో పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది, అలాగే జనసేన ప్రభుత్వం రాగానే ప్రతి గ్రామాభివృద్ధి దిశగా బలమైన అడుగులు వేస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024 లో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని  ముఖ్యమంత్రిని చేయవలసిందిగా  ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తడ మండల ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ కుమార్, స్థానిక జనసైనికులు మల్లి, రమేష్, సునీల్, వంశీ, హరి, శేఖర్, సురేష్, వీరాస్వామి, అశోక్, శివ, సునీల్, కార్తీక్, కస్తూరయ్య, వర్ధన్ తదితరులు పాల్గొని పవనన్న రావాలి పాలన మారాలి అంటూ నినాదాలు చేశారు.