నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో క్రీడా పోటీల నిర్వహణ



నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కోట మండలం, కోట గ్రామం లోని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ గ్రౌండ్ నందు వాలీబాల్ టోర్నమెంట్ ,హండ్రెడ్ మీటర్స్ పరుగుపందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ పోటీలను వాకాడు బ్లాక్ వాలంటీర్ సలవాడి సోనియా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కోట యూత్ క్లబ్ ప్రెసిడెంట్ నిఖేష్ పరుశురాం సాయి సహకరించడం జరిగింది. అనంతరం పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ముఖ్య అతిథుల ద్వారా ట్రోఫీలు, షీల్డ్ లు ,బంగారు, రజత, కాంస్య పతకాలను అందజేశారు. నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు యూత్ ఆఫీసర్ ఏ మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలోని యువతీ యువకులలో ఉన్నటువంటి ప్రతిభా పాటవాలను బయటకు తీసి వారిని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు పూర్తి సహాయ సహకారాలను నెహ్రూ యువ కేంద్ర ద్వారా అందజేస్తాము అని తెలియజేశారు.శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి చైర్మన్ అల్లం రమణయ్య మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఈరోజు మన ఓటమి రేపటి గెలుపుకు నాంది అని తెలిపారు. డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ క్రీడలు ఆడడం ఆరోగ్యానికి  మంచిది అని తెలిపారు. తదుపరి సమరసత సేవా ఫౌండేషన్ గూడూరు డివిజన్ ధర్మ ప్రచారక్ శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ యువత స్మార్ట్ ఫోన్ కి బానిసలు కాకుండా రోజు ఒక గంట సమయం క్రీడామైదానంలో చెమట వెదచిందే విధంగా క్రీడలలో పాల్గొనాలి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లో పి డి శ్రీ రేష్, , క్రీడాకారులు గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.