రైతులకు ప్రత్యేక విశిష్ట నమోదుకు అవకాశం



 

చేజర్ల,మేజర్ న్యూస్ 

 భూమి ప్రతి రైతుకు ఒక ప్రత్యేక రైతు గుర్తింపు సంఖ్యను ఇవ్వడం జరుగుతుందని, దాని ద్వారా వ్యవసాయ సేవలను సులభతరం చేసి పారదర్శకంగా రైతులకు సేవలందిస్తామని చేజర్ల మండలంలోని మాముడూరు గ్రామంలో ఏవో శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ రైతులకు,రైతు గుర్తింపు సంఖ్య అనేది రైతు రిజిస్ట్రీ పోర్టల్ లో నమోదు చేసిన తర్వాత భూమి గల ప్రతి రైతుకు కేటాయించే ప్రత్యేక గుర్తింపు సంఖ్య అని తెలిపారు. భూ ఆధారిత పథకాలకైనా పీఎం కిసాన్ చెల్లింపులు, అన్నదాత సుఖీభవ, పంట బీమా, పంట రుణాలపై వడ్డీ రాయితీ, రాయితీపై వ్యవసాయ యంత్రపరికరాలు, రాయితీపై సూక్ష్మ పోషకాలు, సూక్ష్మసేద్యంపై రాయితీ, పంట రుణాలు రాయితీ, పెట్టుబడి సహాయం వంటి పథకాలు నేరుగా పొందేందుకు అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూమి గల ప్రతి రైతుకు మున్ముందు కౌలు రైతులకు, భూములేని వ్యవసాయ కూలీలు, ఇతర వ్యవసాయ ఆధారిత వృత్తిలలో ఉన్నవారికి వర్తిస్తుందని వివరించారు. 
నమోదు విధానం ఎలా...
 ఆధార్ నెంబర్, ఆధార్ అనుసంధానిక ఫోన్ నెంబర్, భూమి రికార్డుల వివరాలు, పట్టుదల పాస్ బుక్, తీసుకొని గ్రామంలో రైతు సేవా సిబ్బందికి కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు.