రోడ్డుప్రమాదంలో ఒకరికి గాయాలు

 రవికిరణాలు ప్రతినిధి - దొరవారిసత్రం  న్యూస్:- మండల పరిధిలోని వడ్డిపాలెం గ్రామ సమీపంలో ఉన్న ఆర్ అండ్ బి రోడ్డుపై జరిగిన ప్రమాదంలో శంకర్ అనే అతనికి గురువారం తీవ్ర గాయాలయ్యాయి వివరాల మేరకు శంకర్ స్వగ్రామం సూళ్లూరుపేట మండలం కి చెందిన పేర్నాడు గ్రామము ఇతను బేల్దారి పని కొరకు మోటర్ బైక్ పై మల్లాం వైపు వెళ్తూ ఉండగా వడ్డీ పాలెం గ్రామ సమీపానికి వచ్చేసరికి బైకు అదుపుతప్పి రోడ్డుకి ఇరుపక్కల ఉన్న తూమును ఢీకొన్నది దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి ఈ ప్రమాదాన్ని గమనించిన గ్రామస్తులు వెంటనే 108 వాహనానికి ఫోన్ చేయడం జరిగినది అయితే 108 వాహనం సమయానికి రాకపోవడంతో గాయపడిన క్షత గాత్రుడిని గ్రామస్థుల సహాయంతో ఆటోలో వేసి సూళ్లూరుపేట ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు అక్కడ గాయపడిన వ్యక్తికి చికిత్స చేయించడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు