అంతర్జాతీయ బాలికల దినోత్సవం సంధరర్భంగా  కావలి ఫట్టణంలోని  మానస థియేటర్  దగర ఉన్న మండల పరిషత్  ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న  పదవి తరగతి   విద్యార్థులకు  కావలి మండల న్యాయ విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో  ఈవిటీజింగ్, విద్యా హక్కు, తదితర చట్టా లపై పిల్లలకు న్యాయవాది మరియు పారా లీగల్ వాలంటీర్ ఐ.సాయి ప్రసాద్ అవగాహన కల్పించారు. అలాగే నేటి సాంకేతిక యుగంలో బాగా చదివి బాలుర తో పాటు బాలికలు కూడా పోటీ పడి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థినులను  ఈ సందర్భంగాఆయన కోరారు.  అదే విధంగా అక్కడ అందిస్తున్న ఆహారం,విద్య  తదితర అంశాలను న్యాయవాది, పారా లీగల్ వాలంటీర్  ఐ.సాయి ప్రసాద్, అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాలను శుభ్రం గా వుంచుకోవాలి అని కూడా తెలిపారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  కె.సుబ్బారావు , టీచర్స్ అరుణ, సుజాత,కె.బి.కె. క్రిఫ్ట  కుమార్ , పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.