కండలేరు డ్యామ్ ముంపు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ యాక్ట్ .జీవో నెంబర్ 98. జీవో నెంబర్ 68 లను ఉల్లంఘించిన అధికారులు
కండలేరు డ్యామ్ ముంపు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ యాక్ట్ .జీవో నెంబర్ 98. జీవో నెంబర్ 68 లను ఉల్లంఘించిన అధికారులు
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
కండలేరు డ్యామ్ ముంపు నిర్వాసితుల ఆర్ అండ్ ఆర్ యాక్ట్ .జీవో నెంబర్ 98. జీవో నెంబర్ 68 లను అధికారులు ఉల్లంఘిస్తున్నారు
బ్రిటిష్ కాలం నుండి 2000 సంవత్సరం వరకు లస్కర్లు లాక్ సూపర్వైజర్లు శాశ్వత ఉద్యోగులుగా కొనసాగారు .ప్రస్తుతం ఔట్సోర్సింగ్ విధానం తెచ్చి అధికారులు ప్రాజెక్టులను నిర్వీర్యం చేస్తున్నారు .
ఉమ్మడి జిల్లాలో ఖాళీగా ఉన్న 1000 లస్కర్లను కండలేరు నిరుద్యోగులకు శాశ్వత ఉద్యోగులుగా కేటాయించాలని తెలుగు గంగ ఎస్సి రాధాకృష్ణారెడ్డికి బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు
జీవో నెంబర్ 98 ప్రకారం ప్రాజెక్టులో వేకెన్సీలలో 50% ముంపు వాసులకు కేటాయించాలని ఉంది దానికి అనుబంధంగా జీవో నెంబర్ 68 ద్వారా ప్రభుత్వం తీసుకువచ్చి ఇరిగేషన్ సర్కిలలో ముంపు వాసులకు త్వరితగతిన ఉద్యోగ వసతి కల్పించమని పేర్కొన్నారు
మొదటి సీనియారిటీ జాబితా 2010 సంవత్సరంలో
రెండవ సీనియారిటీ జాబితా 2014 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ చేసి వీరికి ఉద్యోగాలు కేటాయించమని చెప్పింది
అయితే అధికారులు అవగాహన లోపం వలన వేకెన్సీ లలో 50% ముంపు వాసులకు కేటాయించమని ఉంటే దానిని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సీనియారిటీ జాబితా లో 50% ఉద్యోగాలని అధికారులు అవగాహన లోపంతో జీవోలను ఉల్లంఘిస్తున్నారు.
జీవో
నెంబర్ 98 జీవో నెంబర్ 68 ల ప్రకారం కండలేరు నిర్వాసితులకు ఉద్యోగ వసతి కల్పించాలి. లేదా ప్రతి అవార్డుదారుడికి ఆర్ అండ్ ఆర్ యాక్ట్ ప్రకారం ఉపాధి కల్పించ లేనప్పుడు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని రమేష్ డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి. ఏవి సుబ్బయ్య. నీలి శెట్టి లక్ష్మణరావు. ముని సురేష్ ముంపు నిర్వాసితులు పాల్గొన్నారు