మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో విర్రవీగే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు .
మంత్రులు, ఎమ్మెల్యేల అండదండలతో విర్రవీగే అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు .
అందుకు నిదర్శనమే పొదలకూరు పూర్వ తహసీల్దార్ స్వాతి సస్పెన్షన్ కాకాణి ఆదేశాలు, అండదండలతో స్వాతి అనేక అక్రమాలు, భూదందాలకు పాల్పడింది స్వాతిని సస్పెన్షన్ తో కాకుండా డిస్మిస్ చేయాలి... ఆ భూ దందా లో ప్రధాన సూత్రధారి అయిన ఎమ్మెల్యే కాకాణి అనుచరుడు ప్రవీణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలి. నెల్లూరులోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాజీ మంత్రి,పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి
జిల్లాలో దారుణంగా భూ కుంభకోణాలకు పాల్పడుతుంటే మేము ఫిర్యాదు చేసే వరకు చర్యలకు దిక్కులేదు. జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. జిల్లా కలెక్టర్, ఆర్ డి వో లు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. జిల్లాలో జరిగిన భూ కుంభకోణాలపై కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ తక్షణం ఎంక్వయిరీ కమిటీ వేయాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జరిగిన భూ కుంభకోణాలకు సంబంధించిన వివరాలను బయట పెడతాం. గడిచిన రెండున్నర సంవత్సరంలో జరిగిన భూ కుంభకోణాలపై 70 ఎం ఎం సినిమా చూపిస్తాం అధికారుల ఉద్యోగాలు పీకే దమ్ము ఎవరికీ లేదు... వారు ఇప్పటికైనా నిజాయితీ నిబద్ధతతో పని చేయాలి. ప్రజల ఆస్తులు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉందని అధికారులు గుర్తించుకోండి. లక్షల రూపాయల జీవితాలతో పాటు అధికారులకు హోదాను కల్పించింది..ప్రజల ఆస్తులను కాజేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవడానికి కాదు.అధికారులు అంటే మాకెంతో గౌరవం ఉంది... ఇక్కడుండే అవినీతి ఎమ్మెల్యేలను చూసి ఎందుకంత భయపడిపోతున్నారు... దిగజారి పోతున్నారు. నెల్లూరు జిల్లాలో పనిచేసిన గత కలెక్టర్లు ఒక చరిత్ర... తరతరాలకు వారి పేర్లు గుర్తుండేలా పనిచేశారు. తహసిల్దార్ గా పనిచేసి సస్పెండ్ అయిన స్వాతి అంటే మాకు కక్ష లేదు... సానుభూతి ఉంది... ఎమ్మెల్యే కాకాని చేసిన పనులకు ఆమె బలయింది. అధికారి స్వాతిని సస్పెండ్ కాదు సర్వీసు నుంచి డిస్మిస్ చేయాలి దాంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. పొదలకూరులో జరిగిన భూ కుంభకోణంలో స్వాతి తో పాటు ఆమె వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలి తహసిల్దార్ గా స్వాతి కుంభకోణాలకు పాల్పడుతోందని మేము చెప్పేంతవరకు చర్యలకు దిక్కులేదు. సాక్ష్యాలతో ఫిర్యాదు చేసినా ఆమెపై జిల్లా కలెక్టర్, కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. జిల్లాలోని ఎమ్మెల్యేలు ఏం చెబితే అది చేయండి అనేలా దరిద్రమైన పరిస్థితిలో జిల్లా ఉన్నతాధికార యంత్రాంగం వ్యవహరిస్తోంది. జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో ఉన్న డికేటి, అసైన్డ్, ప్రభుత్వ ల్యాండ్స్ అన్ని మారిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు తెలియకుండా భూ కుంభకోణాలు జరిగిపోతున్నాయ్. పొదలకూరు, వెంకటాచలం,చిల్లకరు మండలాల్లో కాకాణి టీమ్ భూ కుంభకోణాలకు పాల్పడుతోంది. ప్రతీది సాక్షాలతో సహా బయటపెడుతున్నాం. ఒక్క పొదలకూరు మండలం లోనే వంద కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు... తహసిల్దారుగా స్వాతి పదిహేను కోట్ల రూపాయల వరకు అక్రమ సంపాదన చేసినట్లు తెలుస్తోంది. చిల్లకూరు లో జరిగిన భూ కుంభకోణం సంబందించి అక్కడి అధికారిపై కేసు నమోదు చేశారు... భూ కుంభకోణాలు జరిగినట్లు రుజువైనా వెంకటాచలం, పొదలకూరు మండలాల తాసిల్దారు లపై ఇక్కడ ఆర్డీవో, కలెక్టర్ ఎందుకు కేసులు నమోదు చేయలేదు. వెంకటాచలం మండలం కాకుటూరు భూకుంభకోణం కేసులో వైసీపీ నేత పెంచలభాస్కర్, పొదలకూరు కంప్యూటర్ ఆపరేటర్ గీతాను చిల్లకూరు మండలం సీలింగ్ భూముల కుంభకోణంలో వై సీ పీ నేత దర్శి విజయబాబు ను అరెస్ట్ చేశారు..చిల్లకూరు కేసులో అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.. కానీ పొదలకూరు భూ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి అయిన కాకాణి అనుచరుడు ప్రవీణ్ ను ఇంత వరకు అరెస్టు చేయలేదు. ఇప్పటికీ ఎమ్మెల్యే కాకాణి ల్యాండ్ బ్యాంకు పెంచేందుకు ప్రవీణ్ కీరోల్ ప్లే చేస్తున్నాడు. వెంకటాచలం, పొదలకూరు తహసీల్దారులపై ఎవరి ఒత్తిళ్లతో కేసులు నమోదు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది
బీదా రవిచంద్ర
సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా ఫలితం లేకుండా పోతోంది. పొదలకూరు,వెంకటాచలం మండలాల్లో జరుగుతున్న భూ అక్రమాలు, గ్రావెల్ అక్రమ తరలింపు పై సంవత్సరం పాటు గా పలుమార్లు ఫిర్యాదు చేసిన జిల్లా అధికారులు స్పందించలేదు. జిల్లాలోని ప్రతిపక్ష పార్టీ నాయకులు మొత్తం కలెక్టరేట్ లో జరిగే గ్రీవెన్స్ లో అక్రమాల పై ఫిర్యాదు చేసిన అధికారులు చర్యలు తీసుకోలేక పోవడం దౌర్భాగ్యం. చివరికి లోకాయుక్తకు ఫిర్యాదు చేసి, అక్కడి నుంచి ఆదేశాలు వస్తే కానీ జిల్లా అధికార యంత్రాంగం స్పందించని పరిస్థితి. సమస్యలను తెలియజేస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే చర్యలు చేపట్టక పోగా వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు... సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలపై చర్యలు తీసుకోక పోగా టిడిపి నాయకుల పై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జరుగుతున్న భూ అక్రమాల కలెక్టర్ దృష్టికి తీసుకురావడమే కాక విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో పరిశ్రమ మంత్రి ఉంటే పరిశ్రమలు తరలిపోతున్నాయ్... ఇరిగేషన్ మంత్రి ఉన్నా ప్రయోజనం లేదు. టీడీపీ హయాంలో సోమశిల ఫారెస్ట్ క్లియరెన్స్ వస్తే ఇంత వరకు అది ముందుకు సాగడం లేదు. జిల్లాలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది... స్థానిక ప్రజలు మీడియా ప్రతినిధులు అక్రమ దందా పై గగ్గోలు పెట్టినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు.