ట్రాన్స్ఫార్మర్ స్తంభాలకు అల్లుకుపోయిన చెట్ల తీగలు పట్టించుకోని అధికారులు
ట్రాన్స్ఫార్మర్ స్తంభాలకు అల్లుకుపోయిన చెట్ల తీగలు పట్టించుకోని అధికారులు
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకి మండలంలోని విద్యుత్ శాఖకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ పరమైన సమస్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి . మండల కేంద్రమైన జలదంకి బస్టాండ్ సెంటర్ల థాంక్స్ ఫార్మర్ కు చెట్ల తీగులు అల్లుకొని ప్రమాదకరంగా మారాయి. దీంతో బస్టాండ్ సెంటర్కు వచ్చే ప్రయాణికులు, ప్రజలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మీదుగా జలదంకి లోని విద్యార్థులు కూడా ఆ ట్రాన్స్ఫర్ ఉండే రోడ్డుమీద ప్రయాణించాలసి ఉంది విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక బస్టాండ్ సెంటర్లో ఉన్న థాంక్స్ ఫార్మర్ వద్ద ఏదో ఒక సమయంలో మంటలు చెల్లరేగుతున్న పట్టించుకున్న దాఖలాలు లేవు. గ్రామ ప్రజలు విద్యార్థుల బాధలు అర్థం చేసుకొని విద్యుత్ శాఖ బస్టాండ్ సెంటర్లో ఉన్న థాంక్స్ ఫార్మర్ వద్ద ఉన్న చెట్లను తొలగించడంతోపాటు విద్యుత్ సరఫరా కు అంతరాయం లేకుండా సేవలు అందించాల్సిన అవసరం ఉంది.