కార్యక్రమంలో పాల్గొన్న అధికార పార్టీ నాయకులు అధికారులు. 

బ్రహ్మ దేవి గిరిజన కాలనీలో స్వచ్ఛ ఆంధ్ర.... స్వచ్ఛ దివస్. 




ముత్తుకూరు ,ఫిబ్రవరి 15 (మేజర్ న్యూస్) మండలంలోని బ్రహ్మదేవి గ్రామపంచాయతీ గిరిజన కాలనీలో శనివారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ నాయకులు షేక్ అలిముత్తు గ్రామస్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యానర్ చేత పట్టుకుని గ్రామంలో ర్యాలీ జరిగింది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఈ కార్యక్రమం గురించి అధికార పార్టీ నాయకులు మాట్లాడారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేసినట్లు తెలియజేశారు. చుట్టుపక్కల పరిసరాలు బాగుండాలని ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం బాగుంటుందని అధికార పార్టీ నాయకులు షేక్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విస్తరణ అధికారి హేమంత్, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు