కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణపట్నం పోర్టు అధికారులు అధికార పార్టీ నాయకులు. నేస్తం ఫౌండేషన్, ఆర్ వై ఎస్ టీం సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణపట్నం పోర్టు అధికారులు అధికార పార్టీ నాయకులు. నేస్తం ఫౌండేషన్, ఆర్ వై ఎస్ టీం సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.
జ్యోతి వెలిగించి ప్రారంభించిన కృష్ణపట్నం పోర్టు సీఈవో జగదీష్ పటేల్.
ముత్తుకూరు ,జనవరి 24( మేజర్ న్యూస్) కీర్తిశేషులు కృష్ణపట్నం పోర్టు మాజీ సీఈఓ అవినాష్ చంద్రాయ్ , శివ గార్ల జ్ఞాపకార్థంగా నేస్తం ఫౌండేషన్, ఆర్ వై ఎస్ టీం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ముత్తుకూరు మండల కేంద్రం వేదికగా ఎంపీడీవో కార్యాలయం వెనుక వైపున ఖాళీ స్థలంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ సీఈఓ జగదీష్ పటేల్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా క్రికెట్ టోర్నమెంటుకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాటుచేసిన నాలుగు టీములు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఈదురు రామ్మోహన్ రెడ్డి, అదాని ఫౌండేషన్, విహారి క్రికెట్ క్లబ్ కి సంబంధించి టీ షర్ట్లు ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ రక్తాన్ని సేకరించడం జరిగింది. రక్తదాన శిబిరంలో 153 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఈ శబరిమ నందు రక్తదానం చేసిన యువకులను సి ఈ ఓ తో పాటు పోర్టు అధికారులు గంట వేణుగోపాల్ , రాజేష్ రంజన్, మృత్యుంజయ రామ్, అధికార పార్టీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి, నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు కోరెం ప్రవీణ్ కుమార్, వెంకటేశ్వర్లు, ఆర్ వై ఎస్ టీం యల్లంగారి ఎల్లయ్య , కోడూరు రవి, వల్లికల సుధాకర్ సంయుక్తంగా అభినందించి సహకారం అందించారు. ఈనేపద్యంలో కార్యక్రమం ఏర్పాట్లను విజయ్, కళ్యాణ్ ,మోహన్ రావు, శ్రావణ్, ఉదయ్, అక్కయ్య గారి ప్రసాద్ పర్యవేక్షణ చేశారు. ఈ సందర్భంగా పోర్టు సి ఈ ఓ మాట్లాడారు. యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు . సామాజ సేవా కార్యక్రమాలకు కృష్ణపట్నం పోర్ట్ యాజమాన్యం ఎల్లప్పుడూ సహకారం ఇస్తూ ప్రోత్సాహాన్ని కల్పిస్తుందని సీఈఓ అన్నారు . యువకులు మంచి మార్గంలో నడుస్తూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడుతున్నారని సీఈఓ ప్రశంసించారు . ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.