కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నాయకులు. బ్రహ్మ దేవి లో రెవెన్యూ సదస్సు.
కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నాయకులు. బ్రహ్మ దేవి లో రెవెన్యూ సదస్సు.
ముత్తుకూరు, డిసెంబర్ 21( మేజర్ న్యూస్) బ్రహ్మ దేవి గ్రామంలో శనివారం రెవిన్యూ సదస్సు జరిగింది. అధికార పార్టీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్, సాగునీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు, మాజీ ఎంపీపీ దీనయ్య, బీసీ నాయకులు బొబ్బేపల్లి అంకయ్య, సాగునీటి సంఘం డైరెక్టర్లు తోపాటు డిప్యూటీ తాసిల్దారు ప్రదీప్, మండల భూమి కొలతల శాఖ అధికారి అను రూప్ , గ్రామ రెవెన్యూ అధికారులు ప్రసాద్, సురేష్, గ్రామ సచివాలయం సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి లెనిన్, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భూముల సమస్యలపై రైతులు తమ అర్జీలను అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీ నాయకులు కొత్తపల్లి మాట్లాడారు. సమస్యలపై అర్జీలు ఇచ్చేటప్పుడు స్పష్టంగా ఉండాలని ఆయన అన్నారు. నిరాధారమైన అర్జీలు ఇవ్వడం వల్ల అధికారులు ఇబ్బందులు పడతారని వాస్తవం తెలియజేస్తూ అర్జీలు ఇస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు