కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు నాయకులు. 




రైతుల ప్రమేయం లేకుండానే సర్వే చేసేస్తారా?

రెవిన్యూ సదస్సులో పంటపాలెం రైతులు ఆగ్రహం. 

ముత్తుకూరు ,డిసెంబర్ 17 (మేజర్ న్యూస్) గత ప్రభుత్వంలో సాగరమాల ప్రాజెక్టు నేషనల్ హైవే రోడ్డు నిర్మాణానికి అధికారులు రైతుల ప్రమేయం లేకుండానే సర్వే చేశారని ఎంత అన్యాయం అంటూ పంటపాలెం గ్రామ రైతులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు జరిగింది. స్థానిక సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు, అధికార పార్టీ నాయకులు రామ్మోహన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, గ్రామస్తులు రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతుల నుంచి వచ్చిన అర్జీలను సర్వే డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు తీసుకున్నారు. వచ్చిన అర్జీలను అధికారులు ఆన్ లైన్ చేశారు. అనేక రకాల సమస్యలపై 13 అర్జీలు వచ్చినట్లు రెవెన్యూ శాఖ అధికారులు తెలియజేశారు. సాగరమాల ప్రాజెక్టు రోడ్డు నిర్మాణంలో భూములు తీసుకునే అంశం పైన సమగ్రమైన స్పష్టత లేకుండా పోయిందని దీంతో రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారని అయినా కూడా పరిష్కారం కాలేదు అన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రైతులు ఇబ్బందులు పడ్డారని అధికార పార్టీ నాయకులు విమర్శించారు. రైతులకు చెప్పకుండా భూములు తీసుకుని నానా ఇబ్బందులు చేశారని ఆరోపించారు. అదే విధంగా మిగులు భూములు పేదలకు పంచాలని సర్పంచ్ అధికారులకు తెలియజేశారు. సగటు మండల ప్రాజెక్ట్ తో రైతులకు మధ్య సమన్వయం కుదిరే విధంగా సమావేశం ఏర్పాటు చేస్తే రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు