ఆత్మకూరు, జనవరి 11, (రవికిరణాలు) : నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని మర్రిపాడు మండలంలో హై లెవెల్ కెనాల్ క్రింద ప్రభుత్వ భూమి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటనష్ట మును పూర్తి చేయాలనీ వ్యవసాయశాఖను మంత్రి ఆదేశించారన్నారు. ఇంకా వారంలో పంట నష్టమును అంచన వేయాలన్నారు. మండలంలో2765మంది ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించామన్నారు. ఉగాది నాటికీ ఇళ్ల పట్టాలు పంపిణి చేస్తామన్నారు. హైలెవెల్ కెనాల్ సర్వేకు రెండు టీములు వస్తన్నందున భూసేకరణ సర్వే త్వరలో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశానికి తహసీల్దార్ సుధాకర్, ఎస్సై ఎంఎస్ రాకేష్, డిటి అనీల్ కుమార్, ఎపిఓ లక్ష్మి నరసయ్య, వీఆర్వోలు, పాల్గొన్నారు.