శ్రీసిటీ-కెలాగ్స్ పరిశ్రమ చే విద్యార్థులకు పౌష్టికాహారం - చెరివి పాఠశాలలో "బ్రైట్ స్టార్ట్" కార్యక్రమం ప్రారంభం
శ్రీసిటీ-కెలాగ్స్ పరిశ్రమ చే విద్యార్థులకు పౌష్టికాహారం
- చెరివి పాఠశాలలో "బ్రైట్ స్టార్ట్" కార్యక్రమం ప్రారంభం
రవి కిరణాలు న్యూస్ తడ శ్రీసిటీ, మార్చి 25, 2023:
శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో శ్రీసిటీలోని కెలాగ్స్ పరిశ్రమ సత్యవేడు మండలంలోని చెరివి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో "బ్రైట్ స్టార్ట్" (ఉజ్వల ఆరంభం) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో ప్రతిరోజూ ఉదయం విద్యార్థులకు పాలు, సాయి స్యూర్ న్యూట్రిషన్ పౌడర్ తో చాకోస్ కలిపిన పౌష్టికాహారం ఇస్తారు. పాఠశాల ఆవరణలో కెలాగ్స్ ప్లాంట్ లీడ్ శేఖర్ భోస్లే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా, శ్రీసిటీ వైస్ ప్రెసిడెంట్ (కస్టమర్ రిలేషన్స్) రమేష్ కుమార్, కెలాగ్స్ ప్లాంట్ హెచ్ ఆర్ లీడ్ హరి జయబాలన్, ఈ హెచ్ ఎస్ లీడ్ సురేష్ బాబు, క్వాలిటీ లీడ్ సుధీర్ పడాల, ఇతర పలువురు కెలాగ్స్, శ్రీసిటీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శేఖర్ భోస్లే మాట్లాడుతూ, కెలాగ్స్ సంస్థ కార్పొరేట్ సామాజిక భాద్యత చర్యల్లో భాగంగా తమ ఎన్జీఓ భాగస్వామి సాయి అన్నపూర్ణ ట్రస్ట్ తో కలసి విద్యార్థుల ఆరోగ్య పరిపుష్టి మరియు డ్రాప్ ఔట్స్ ను తగ్గించే ఉద్దేశ్యంతో "బ్రైట్ స్టార్ట్" కార్యక్రమం వివిధ ప్రభుత్వ పాఠశాలలలో చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఇప్పటికే శ్రీసిటీ పరిధిలోని ఇరుగుళం, మాధనపాలెం ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ప్రారంభించబడగా, ప్రస్తుతం చెరివిలో మొదలుపెట్టామని చెప్పారు. త్వరలో శ్రీసిటీ పరిసరాల్లోని ఇతర అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కెలాగ్స్ చర్యలను శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఒక ప్రకటనలో అభినందించారు. పౌష్ఠిక అల్పాహారంతో రోజును ప్రారంభించడం ద్వారా విద్యార్థులకు ఇది మంచి ప్రయోజనాన్ని కలుగచేస్తుందని ఆయన అన్నారు.
మొత్తంగా 700 మంది విద్యార్థులకు దీని ద్వారా లబ్ది చేకూరుతున్నట్లు శ్రీసిటీ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ సురేంద్ర కుమార్ తెలిపారు. శ్రీసిటీ, కెలాగ్స్ యాజమాన్యాలకు చెరివి పాఠశాల ప్రదానాపాద్యాయులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.