మహిళాబివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవం
మహిళాబివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార పక్షోత్సవం
నెల్లూరు, రవికిరణాలు ఏప్రిల్ 09 :
మహిళాబివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఐ సి డి ఎస్ ప్రాజెక్టు, నెల్లూరు వారు పౌష్టికాహార పక్షోత్సవం లో భాగంగా బాలాజీ నగర్ సెక్టార్ లోని రాయపు హెచ్ డబ్ల్యు 1 మరియు 2 అంగన్వాడి సెంటర్ లో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీడీపీఓ కే. లక్ష్మీ దేవి మాట్లాడుతూ.... గర్భవతులు బాలింతలు మరియు సంరక్షకులకు మొదటి 1000 రోజులలో తీసుకోవలసిన పోషకాహారం యొక్క ప్రాముఖ్యత ను వివరించటం జరిగింది గర్భస్త సమయం లో తల్లి తీసుకునే ఆహారమే బిడ్డ ఆరోగ్యానికి రక్ష అని ఆ బిడ్డ పెరిగి పెద్ద అయ్యాక కుడా అదే ప్రభావితం చేస్తుంది కనుక పోషకాహారం తీసుకోవటం అత్యంత ప్రధానం అని తెలియ చేయడం జరిగింది అలాగే గర్భధారణ సమయం లో కనీసం 4 సార్లు వైద్య పరీక్షలు చేయించుకోవాలి ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు తప్పని సరగా వేసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి మానసికం గా ఉల్లాసం గా ఉత్సాహం గా ఉండాలి తల్లి మానసిక ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యం పై ప్రభావం చూపుతుందని తెలియ చేయడం జరిగింది. అలాగే సెక్టార్ సూపర్వైజర్ ఎమ్. స్వరూప మాట్లాడుతూ.... బిడ్డ పుట్టిన తర్వాత గంట లోపు తల్లి పాలు ఇవ్వాలి మొదటి ఆరు నెలలు తల్లి పాలు మాత్రమె పట్టించాలి అని మరియు తల్లి పాలు పుష్కలంగా రావటానికి తల్లి సరియైన పోషకాహారం తీసుకోవాలని వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని 6 నెలల తర్వాత తల్లి పాలతో పాటు అనుబంధ పోషకాహారం బిడ్డకు తినిపించాలి తెలియచేశారు. అదేవిధంగా గర్భవతులు , బాలింతలు మరియు 0 నుండి 2 సంవత్సరముల పిల్లల గృహ సందర్శన చేసి తల్లి పాలు మరియు అనుబంధ పోషకాహారం ప్రాముఖ్యత గురించి వివరించటం జరిగింది అలాగే వ్యాధి నిరోధక టీకాల షెడ్యూల్ లను ( ఎమ్ సి పి కార్డు) పరిశీలించటం జరిగింది.ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు అరుణమ్మ జయలక్ష్మి, ముకుంద, వాణి, పద్మ, కామాక్షి తదితరులు పాల్గొనడం జరిగింది.