మోదీ పాలనలో దేశానికి ,పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదు:- మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్.

రవి కిరణాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట:-





ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశానికి కానీ పేద ప్రజలకు గాని ఇలాంటి అన్యాయం జరగలేదని గురువారం కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ మండిపడ్డారు. సూళ్లూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న గాంధీ మందిరం వద్ద మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిగా తిరుపతి కావాలని ర్యాలీ చేపడుతున్నట్లు వెల్లడించారు దేశంలో మోడీ వలన ముగ్గురు మాత్రమే మిగిలిన బడుగు బలహీన వర్గాలు ప్రజలు మాత్రం ఇంకా అట్టడుగునే ఉన్నారని పేద ప్రజలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా ఓడించాలని కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిని కప్పు పుచ్చుకునేందుకు బిజెపితో కలిసి రాష్ట్రాన్ని అప్పుల మయం చేశారని ఆరోపించారు. ఇటు తెలుగుదేశం కూడా బిజెపితో జతకట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచనలు ఉన్నారని కాబట్టి ప్రజలందరూ నమ్మొద్దని కాంగ్రెస్కే ఓటేయాలని మన రాజధానిగా తిరుపతిని సాధించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కన్నంభాకం హరికృష్ణ, చందనమూడి మని, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.