కలెక్టర్ గారు...మీ పరిపాలన మొత్తం అధికార పార్టీ నాయకుల వద్ద బాజాలు కొట్టడానికే సరిపోతుంది...

బాజాలు కొట్టడం కాదు..ప్రజా సమస్యలపై దృష్టి సారించండి...మహనీయులను విస్మరించకండి...

మనకు భిక్షపెట్టిన మహనీయులను గుర్తు చేసుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత.

అలాంటి మహనీయులను స్మరించుకోవడం మన అదృష్టం.

దానిని విస్మరించిన రోజు పతనం కాక తప్పదు.

గత సంవత్సరం జరిగిన జయంతి కార్యక్రమానికి సంబంధించిన పూలమాలలు ఇప్పటివరకు శుభ్ర పరచకపోవడం దారుణం.





నేను మేయర్ గా ఉన్నప్పుడు మహనీయుల జయంతులకు వర్థంతులకు ఎన్నో ఘనమైన ఏర్పాట్లు చేసేవాడిని..

అధికారం చేతిలో ఉందని, వైకాపా నాయకులు మహనీయుల విషయంలో నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు...

అధికారం రాకముందు గంట గంట కి వచ్చి విగ్రహాల ముందు మొక్కేవారు...

సామాజిక ఉద్యమకారిని సావిత్రి బాయి పూలే జయంతినీ పురస్కరించుకుని, నెల్లూరు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు కప్పిర శ్రీనివాసులు మరియు బీసీ సెల్ ఆధ్వర్యం లో, నెల్లూరు నగరం లోని ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్, నెల్లూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, తాళ్ళపాక అనురాధ ముప్పాళ్ళ విజేత ఇతర టీడీపీ నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించారు. అనంతరం నెల్లూరు నగరంలోని పూలే దంపతుల విగ్రహాల వద్ద సావిత్రిబాయి పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 

పూలే దంపతులు స్వాతంత్య్రానికి ముందే అంటరానితనం పై విద్యపై మహిళలకు సమానత్వం పై పని చేసిన సామాజిక శాస్త్రవేత్తలు అని కొనియాడారు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయిందని, భారత ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రయత్నిస్తోందని అన్నారు. పూలే దంపతులు దాదాపు వంద సంవత్సరాల క్రితమే అట్టడుగువర్గాల వారికి సమానత్వం కల్పించాలని అంటరానితనాన్ని నిర్మూలించాలని ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మహిళలకు విద్య ద్వారా పురుషులతో సమానత్వం కల్పించాలని మొట్టమొదటి పాఠశాల ప్రారంభించిన ఘనత సావిత్రిబాయి పూలే గారిదన్నారు. సమాజంలో మహిళలు విద్యలో పోటీపడే స్థాయికి వచ్చిన ఇంకా సమాన స్థాయి రావాలని అన్ని పార్టీలు దేశం చర్చించుకుంటున్నాయి అన్నారు. పూలే దంపతులు ఎంతో మహోన్నతమైన ఆలోచనతో ఆశయసాధనకు కృషి చేశారనీ, వాటికి అన్ని పార్టీలు, ప్రజాప్రతినిధులు, పౌరులు కట్టుబడి ఉండాలని తెలిపారు. నెల్లూరు లోని పూలే విగ్రహాల వద్ద పరిస్థితిని చూస్తే నెల్లూరు అధికార పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందని అన్నారు.  మందు బాటిల్లతో చీరలతో చెత్తతో పూలే దంపతులు విగ్రహ పరిసరాలు అసహ్యంగా తయారయ్యాయని, చాలా బాధాకరం అన్నారు.  జిల్లా మంత్రి ప్రజాప్రతినిధులు కొత్తగా ఎన్నికైన మేయర్ బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారని మహనీయులను విస్మరించారని విమర్శించారు. మహనీయుల జయంతులు వర్ధంతులు విస్మరించకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని కొత్తగా ఎన్నికైన మేయర్ స్రవంతికి హితవు పలికారు. ఎంతో మంది ఎన్నో పోరాటాలు చేసి ఈ విగ్రహ స్థాపనకు కృషి చేశారని ఈరోజు ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందని అన్నారు.

 దాదాపు రెండు శతాబ్దాలు గడిచినా, వారిని ఇంకా స్మరించుకుంటూ ఉన్నామంటే వారు చేసిన త్యాగాలే వాటికి కారణం అని అన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలని వారు ఎంతగానో కృషి చేశారనీ మహిళలకు ఆస్తులతో సమానత్వం రాదని మహిళలకు విద్య చాలా అవసరమని ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. దాదాపు 150 సంవత్సరాల క్రితం మహిళలకు విద్యతోనే సమానత్వం వస్తుందన్న ఆలోచనతో మొట్టమొదటి మహిళ పాఠశాలను ప్రారంభించారు అని గుర్తు చేశారు. ఆ రోజుల్లో ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే ఇద్దరు కలిసి బడుగు బలహీన వర్గాల మహిళల కోసం పాఠశాల ప్రారంభించారని గుర్తు చేశారు. కులమతాల వ్యత్యాసాలు ఉండకూడదని అందరినీ సమానంగా చూడాలని ఆరోజుల్లోనే వీరిరువురు అందర్నీ చైతన్యపరిచే వారని అన్నారు. అలాంటి మహనీయులను ఈరోజు స్మరించుకోవడం మన అదృష్టమనీ, కార్పొరేషన్లో కొత్త కౌన్సిల్ ఏర్పడి, ఒక బీసీ నాయకుడు మంత్రిగా ఉండి కనీసం ఈ మహనీయుల విగ్రహాలను శుభ్రపరచ లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. గత సంవత్సరం జరిగిన జయంతి కార్యక్రమానికి సంబంధించిన పూలమాలలు ఇప్పటివరకు శుభ్రపరచలేదని ఆవేదన వ్యక్తపరిచారు గతంలో తాను మేయర్ గా ఉన్నప్పుడు మహనీయుల జయంతులకు వర్ధంతులకు ఎన్నో ఘనమైన ఏర్పాట్లను చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారం చేతిలో ఉందని, వైకాపా వారు మహనీయుల విషయంలో నిర్లక్ష్య వైఖరితో ఉన్నారని అధికారం రాకముందు గంట గంట కి వచ్చి విగ్రహాల వద్ద మొక్కే వారని  తెలియపరిచారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలు అగ్రవర్ణాల తో సమానంగా రాణించగలుగుతున్నారంటే వాళ్లు చేసిన కృషి కారణమని, అలాంటి వారిని విస్మరించడం సరికాదన్నారు. వాళ్లు కనక లేకపోయి ఉంటే అగ్రవర్ణాలు, అగ్రవర్ణాలు గా బడుగు బలహీన వర్గాలు అంటరానివారిగా నీ ఉందిపోయేవారని తెలిపారు. అధికారుల పరిపాలన భజనకు తప్ప దేనికి పనికి రావడం లేదని కనీసం మహనీయులకు ఇవ్వాల్సిన గౌరవం అయినా ఇవ్వాలని కోరారు. పై కార్యక్రమం లో ఊరందూరు సురేంద్ర బాబు, పనబాక భూలక్ష్మి, కోమరి విజయ ధర్మవరపు సుబ్బారావు, బాలకృష్ణ చౌదరి, అన్నం దయాకర్ గౌడ్, పొత్తూరి శైలజ, కనపర్తి గంగాధర్, జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, రేవతి, బాపనపల్లి శశిధర్, సెల్వి, ప్రమీల, విజయ, మేడ శ్రీనివాసులు, ఇక్బాల్, చోటు,  బాబు గౌడ్, ఏటూరు రమేష్, మళ్లీ సుబ్బరాయుడు, ఉప్పు రంగా, వంటేరు శ్రీనివాసులు, దోర్నాల హరిబాబు, ఉప్పు భాస్కర్, శాంతి నాయుడు, హనుమంతు, రావుల కోటేశ్వర రావు, శ్రీనివాసరావు, గోపి,