వెంకటగిరి, డిసెంబర్‌ 26, (రవికిరణాలు) : వెంకటగిరి పట్టణ పరిధిలో పోలీస్ స్టేషన్ లో సి.ఐ అన్వర్ బాషా గురువారం ఉదయం అన్వర్ బాషా విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సి.ఐ అన్వర్ బాషా మాట్లాడుతూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఇతరులకు ఇబ్బంది కలుగజేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ముఖ్యంగా యువత ద్వి చక్ర వాహనం పై ఫిట్ లు చేయటం, అలాగే మైనర్ పిల్లలు ద్విచక్ర వాహనం నడిపితే అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు. డిసెంబర్ 31 తేదీ రాత్రి 8 గం,, లను ప్రత్యేక సిబ్బంది ద్వారా అన్ని గమనిస్తూ ఉంటామని అన్నారు. అలాగే వెంకటగిరి సర్కిల్ పరిధిలో ఉన్న ప్రజలందరికీ ముందుగా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎర్రచందనం, ఇసుక రవాణా అక్రమంగా తరలిస్తుంటే మాకు సమాచారం తెలపాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్సై అనూష పాల్గొన్నారు