స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే ఉద్యమం తప్పదు - ఏబీవీపీ
ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్పులు విడుదల చేయకపోతే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ హెచ్చరించారు.ఎమ్మెల్యే లు ఎంపీ లు ఇళ్లను ముట్టడిస్తామని ఏబీవీపీ నాయకులు హెచ్చరించారు.అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో చిలుకూరులోని శ్రీ వేంకటేశ్వర కళాశాలలో కళాశాల గేట్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎబివిపి జాతీయ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ 2017, 18, 19, ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిల ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన అటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తన తనయుడు తూట్లు పొడుస్తున్నారు అని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక కళాశాల యాజమాన్యం నుండి విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధ్యాపకులు జీతాలు లేక విద్యార్థులకు చదువు చెప్పే వారు లేక విద్యాభ్యాసం ఇబ్బందిగా ఉందని ఇప్పటికైనా నా ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు తెలియజేశారు. లేనిపక్షంలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంటిని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాస్టల్స్ కన్వీనర్ చిన్న, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హర్ష, కిరణ్, నవీన్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.