నిర్వి కాలువ పనులు ప్రారంభించిన -ఎమ్మెల్యే కిలివేటి...
నిర్వి కాలువ పనులు ప్రారంభించిన -ఎమ్మెల్యే కిలివేటి...
-27 కోట్లు అభివృద్ధి పనులకు భూమిపూజ -ఎమ్మెల్యే కిలివేటి
రైతుల అభివృద్ధి మా ధ్యేయం -ఎమ్మెల్యే కిలివేటి....
దొరవారిసత్రం రవి కిరణ్ ఆల్ న్యూస్ :- 27 కోట్ల రూపాయలతో నిర్వి కాలువ అభివృద్ధి పనులకు శనివారం సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యులు కిలివేటి సంజీవయ్య మావిళ్ళ పాడు గ్రామ సమీపాన ఉన్న నేర్రి కాలువ ఇరుపక్కల లైనింగ్ చేయు పనులకు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది ఈ సందర్భంగా ముందుగా అభివృద్ధి పనికి భూమి పూజ నిర్వహించి అనంతరం ఆయనమాట్లాడుతూ ఈ కాల్వ పనులు మావిళ్ళ పాడు గ్రామ సమీపాన ప్రారంభమై తడ మండలం వాటం బేడు గ్రామ సమీపం వరకు మొత్తం 17 కిలోమీటర్లు దూరం ఈ కాలువకు ఇరుపక్కల లైనింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఇలా చేయడం వల్ల పడ్డ వర్షపు నీరు ఇంకిపోకుండా అక్కడే ఉండి రైతులు పండించే పంటకు సాగునీరు పుష్కలంగా అందుతుందని అన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల అభివృద్ధి చెందడమే ఆయన ధ్యేయం వ్యవసాయానికి పెద్ద పీట వేసిన ఘనత మన ముఖ్యమంత్రి కే దక్కుతుందని ఆయన అన్నారు ఈనేర్వి కాలువ పనులు రెండు నెలలు లోపల పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సలహాలు సూచనలు అందించారు. ఈ కాలువ పనులు త్వరగా పూర్తి చేస్తున్నందుకు రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట చెంగాళమ్మ టెస్ట్ బోర్డ్ చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి ఎంపీపీలు అనిల్ రెడ్డి ధనలక్ష్మి జడ్పిటిసి సభ్యులు రమేష్ వైసిపి పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి సంబంధిత అధికారులు సూళ్లూరుపేట ఆర్డిఓ రోజ్ మడ్యం హౌసింగ్ డిఇ సత్యనారాయణ తాసిల్దార్ గోపిరెడ్డి దొరవారిసత్రం ఎస్ఐ అజయ్ కుమార్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి గోపిరెడ్డి నాయకులు ఓడూరు రమణారెడ్డి సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...