యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవన్ లో యానాధుల సంక్షేమ సంఘం, యానాదుల ఉద్యోగుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెసి పెంచలయ్య మాట్లాడుతూ 2025 సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, జిల్లా ప్రజలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యానాదుల సంక్షేమ సంఘం జిల్లా చైర్మన్ రాపూరి క్రిష్ణయ్య మాట్లాడుతూ వెన్నెల కంటి రాఘవయ్య భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పల రఘు యానాదుల సంక్షేమ సంఘం జిల్లా నేతలు వెల్లంపల్లి రమేష్, మాకాని రవి, రేపల్లె మధు మానికల మురళి వెల్లంపల్లి శ్రీనివాసులు, ఉద్యోగుల సంఘం నేత చెవూరు సుబ్బారావు, తలపల చంద్రమౌళి, బుదురు కేశవరావు, చలంచర్ల రవీంద్ర, పంతగిరి శ్రీకాంత్, రవికాంత్, చెంబేటి, ఉష, చలంచర్ల కలుగోలమ్మ తదితరులు పాల్గొన్నారు