నెల్లూరు జెడ్పీ ఛైర్మన్ రేసులో 'ఆదాల రచన'
రెండు బలమైన రాజకీయ కుటుంబాల నేపథ్యం
నెల్లూరు జడ్పీ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించడంతో ఆదాల రచన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రెండు బలమైన రాజకీయ కుటుంబాల నేపథ్యంతో ముందుకు వస్తున్న ఆదాల రచన బలమైన అభ్యర్థిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కుమార్తె ఆదాల రచన కావడం గమనార్హం. బ్రాహ్మణపల్లి ఆమె స్వగ్రామం. సార్వత్రిక ఎన్నికల్లో మేకపాటి చంద్రశేఖరరెడ్డి తరఫున ఆమె విస్తృతంగా ప్రచారం చేశారు. మేకపాటి సోదరుల కుటుంబంలో ఏకైక మహిళ కావడంతో మేకపాటి కుటుంబీకులకు మొదటి నుంచి ఆదాల రచన అంటే ప్రత్యేక అభిమానం. ఆమె అభ్యర్ధిత్వంపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దృష్టికి కూడా తీసుకు వెళ్లారు .ఇప్పటికే మేకపాటి కుటుంబం మొత్తం ఆశీర్వచనాలు కూడా లభించినట్లు సమాచారం. అలాగే నెల్లూరు పార్లమెంటు సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్న కొడుకు ఆదాల రాఘవ రెడ్డికి ఆదాల రచన స్వయంగా కోడలు. ఒకవైపు మేకపాటి కుటుంబం ఆశీర్వాదంతో పాటు ఆదాల కుటుంబీకులకు కూడా మద్దతు ప్రకటించడంతో పాటు మంచి విద్యావంతురాలు కావడంతో ఆదాల రచన జడ్పీ ఛైర్మన్ రేసులో ముందంజలో ఉన్నారు. మర్రిపాడు జడ్పిటిసి స్థానం జనరల్ కావడంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు సవ్యంగా జరిగితే మాత్రం ఆదాల రచన పోటీ చేయడం ఖాయంగా మారింది మరో వైపు కాకాని కుటుంబం నుంచి, ఆలాగే మంత్రి అనిల్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి లు మరో పేరు లను జడ్పీ చైర్మన్ తెరపైకి తీసుకు వస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికి నెల్లూరు జిల్లాలో ఆదాల రచన పేరు జడ్పీ రేస్ లో హాట్ టాపిక్ గా ఉంది