నెల్లూరు జిల్లా జాప్ నూతన కమిటీ ఎన్నిక...




జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంద్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ 20 మందితో కూడిన నూతన కమిటీని ప్రకటించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడుగా నరేష్ కుమార్ (ప్రైమ్ 9),  ప్రధాన కార్యదర్శిగా చరిత్ర కుమార్ (రాజ్ న్యూస్), కోశాధికారిగా సురేంద్ర (బిగ్ టీవీ), ఉపాధ్యక్షుడుగా కృష్ణ (6టీవి), ఆర్గనైజింగ్ సెక్రటరీ గా మురళి (బిఆర్కే న్యూస్), జాయింట్ సెక్రటరీలగా మధు (ప్రైమ్9), వెంకట్ (సూర్య)లను ఎన్నుకున్నారు. ఇక ఈసీ మెంబర్లగా  వెంకయ్య (ప్రైమ్9), జోషి(బిఆర్కే), మధు (బిఆర్కే), ప్రదీప్ (సూర్య), సురేష్, రఫీ, మహేష్ (రవికిరణాలు), రాజేష్ (సువర్ణ టీవీ) జోసఫ్ (సాస్ టీవీ), సునీల్ (మెగా టీవీ), విజయ్ (సూర్య) ప్రవీణ్ (మెట్రో మీడియా), నజీర్ (రవికిరణాలు) ని నియమించారు...


ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, జిల్లా అధ్యక్షుడు నరేష్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని విధాల అండగా జాప్ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాల ను ఇప్పించడంతో పాటు, ప్రతి జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కట్టించేందుకు పూర్తిస్థాయి కృషి చేస్తామన్నారు. అత్యంత త్వరలో నెల్లూరులో జిల్లా మహాసభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరవుతారన్నారు. జాప్ వేదికగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.