నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) దక్షిణాది రాష్ట్రాల సదస్సులో పాల్గొన్న నెల్లూరు నగర మేయర్ స్రవంతిజయవర్ధన్
నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) దక్షిణాది రాష్ట్రాల సదస్సులో పాల్గొన్న నెల్లూరు నగర మేయర్ స్రవంతిజయవర్ధన్
తమిళనాడు లో జరిగిన కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, తమిళనాడు ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి బోర్డుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దక్షిణాది రాష్ట్రాల సేన్సిటైజేషన్ కం రివ్యూ వర్క్ షాప్ “నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) & XV-FC మిలియన్ ప్లస్ సిటీస్ ఫండ్ (XV-FC MPCCF)” సదస్సులో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతిజయవర్ధన్ శనివారం పాల్గొన్నారు. చెన్నై లోని ITC గ్రాండ్ చోళ వేదికలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ వర్క్ షాప్ లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, అండమాన్ నికోబార్, లక్ష ద్వీప్, పాండిచేరి, డయ్యు & డామన్, దాద్రా & నగర్ హవేలీ రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొంటున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఆదేశాల మేరకు 2024 సంవత్సరం నాటికి వాయు కాలుష్యం 20-30% వరకు తగ్గించాలని ప్రతిపాదించే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP) నిబందనలను సవరించే దిశగా సదస్సులో ప్రతినిధులు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖామాత్యులు భూపేందర్ యాదవ్, అడిషనల్ సెక్రటరీ అఫ్ ఇండియా నరేష్ పాల్ గంగ్వర్, తమిళనాడు పర్యావరణ మరియు కాలుష్య నియంత్రణ శాఖా మంత్రి శివ వి.మెయ్యనాథన్, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి వర్యులు అశ్విని కుమార్ చౌబే, కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల సెక్రటరీ లీలా నందన్ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.