శ్రీసిటీని సందర్శించిన నెల్లూరు అసిస్టెంట్ కలెక్టర్
శ్రీసిటీని సందర్శించిన నెల్లూరు అసిస్టెంట్ కలెక్టర్
రవి కిరణాలు తడ శ్రీసిటీ, మే 22, 2023:
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ జి.విద్యాధరి IAS సోమవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆమెకు సాదర స్వాగతం పలికి, ఏకీకృత వ్యాపార నగరం ప్రగతిని వివరించారు. శ్రీసిటీ ప్రత్యేకతల గురించి చెబుతూ, పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేస్తూ మేక్-ఇన్-ఇండియా ప్రచారానికి ధీటుగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంలోని భారీ పారిశ్రామిక పార్కుల్లో ఒకటిగా శ్రీసిటీ ఎలా ఎదిగిందో తెలిపారు.
అసిస్టెంట్ కలెక్టర్ ఎంతో ఆసక్తిని కనబరిచి, వివిధ అంశాలపై ప్రశ్నలడిగి శ్రీసిటీ గురించి తెలుసుకున్నారు. శ్రీసిటీ ప్రగతిని ప్రశంసించిన ఆమె, అద్భుతమైన మౌళిక సదుపాయాలు, వ్యాపారానుకూల వాతావరణంతో ప్రపంచ-స్థాయి బహుళ-ఉత్పత్తుల తయారీ కేంద్రంగా దీనిని తీర్చిదిద్దిన శ్రీసిటీ యాజమాన్య కృషిని అభినందించారు. ఈ ప్రాంత ప్రగతికి చేస్తున్న ప్రయత్నాలను కొనియాడారు.
పర్యటనలో భాగంగా శ్రీసిటీ పరిసరాలతో పాటు వెర్మీరిన్, పాల్స్ ప్లష్, ఎవర్టన్ టీ, హంటర్ డగ్లాస్ పరిశ్రమలను అసిస్టెంట్ కలెక్టర్ సందర్శించారు.
01 - సబ్ కలెక్టర్ కు శ్రీసిటీ నమూనా వివరణ
02 - సబ్ కలెక్టర్ కు జ్ఞాపికను అందచేస్తున్న శ్రీసిటీ ఎండీ
03 - వెర్మీరిన్ పరిశ్రమ సందర్శన